శేషాచలంలో అలజడి | Task force Police hunting for Smugglers in Sheshachalam | Sakshi
Sakshi News home page

శేషాచలంలో అలజడి

Dec 1 2018 8:49 AM | Updated on Dec 1 2018 9:13 AM

Task force Police hunting for Smugglers in Sheshachalam - Sakshi

సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. రంగంపేట సమీపంలోని భీమవరం ఘాట్ మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు తారసపడ్డారు. అడవిలోకి వాహనం వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలో తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సిబ్బందిని చుట్టుముట్టిన స్మగ్లర్లు మారణాయుధాలు, రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం  టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు ఉండొచ్చని సమాచారం. ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement