సందడి చేసిన మిల్కీబ్యూటీ

Tamannah Visit Bheemavaram For Open Happy Mobles Showroom - Sakshi

హ్యాపీ మొబైల్స్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన తమన్నా

భీమవరంలో సినీ హీరోయిన్‌ (మిల్కీబ్యూటీ) తమన్నా సోమవారంసందడి చేశారు. హ్యాపీ మొబైల్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా  అభిమానుల కోరిక మేరకు సినిమా పాటకు స్టెప్‌వేసి అలరించారు.  

భీమవరం: సినీ హీరోయిన్‌ తమన్నా భాటియా భీమవరంలో సోమవారం సందడి చేసింది. పట్టణంలోని హ్యాపీ మొబైల్‌ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం తనతో పాటు తన అభిమానితో కలిసి చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగువారి ప్రేమాభిమానాలు ఎప్పటి మర్చిపోలేనని చెప్పారు. తెలుగు క్షుణ్నంగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భీమవరం పట్టణం మళ్లీమళ్లీ రావాలనిపించేలా ఉందన్నారు. తాను ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో కలసి సైరా చిత్రంలోను, దటీజ్‌ మహాలక్ష్మి చిత్రంలోను నటిస్తున్నట్టు వెల్లడించారు. చిరంజీవితో కలసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తెలుగుసినీ పరిశ్రమలో రామ్‌చరణ్, ప్రభాస్, రాణా అంటే ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు. డ్యాన్స్‌లో ప్రభుదేవా తనకు గురువని చెప్పారు.  హ్యాపీ మొబైల్స్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో విక్రయాలు చేయడంతో పాటి ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అధినేత కృష్ణపవన్‌ మాట్లాడుతూ కస్టమర్లకు సంతోషాన్నివ్వడమే తమ లక్ష్యమన్నారు. భీమవరంలోని పీపీ రోడ్డులో 30వ షోరూంను ప్రారంభించామని తెలిపారు. తొలి ఏడాదిలోనే 200 నూతన షోరూమ్‌లు ఏర్పాటు చేయాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. భారీ డిస్కౌంట్‌లతో సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోటా సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top