వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లి కేఎల్ రావు నగర్ వాసులు కలిశారు.
తాడేపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లి కేఎల్ రావు నగర్ వాసులు కలిశారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపు తాడేపల్లిలో ఆగారు. ఈ సందర్భంగా కేఎల్ రావు నగర్ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఎక్స్ప్రెస్ హైవే పేరుతో తమ ఇళ్లను తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను పెదగొట్టిపాడులో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో కూలీని ఆయన పరామర్శిస్తారు.