ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై గవర్నర్ సమక్షంలో రెండు రాష్టాల విద్యాశాఖ మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై గవర్నర్ సమక్షంలో రెండు రాష్టాల విద్యాశాఖ మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు.
ఇంటర్ పరీక్షలు విడిగానే నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి అన్నారు. ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ మంత్రి కోరారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులకు గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళతామని చెప్పి మంత్రులు సమావేశం నుంచి వెళ్లిపోయారు.