‘తన వల్లే రాష్ట్ర విభజన అని.. నేడు బ్లాక్‌ డేనా?’ | suravaram takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘తన వల్లే రాష్ట్ర విభజన అని.. నేడు బ్లాక్‌ డేనా?’

Jun 4 2017 7:14 PM | Updated on Sep 5 2017 12:49 PM

‘తన వల్లే రాష్ట్ర విభజన అని.. నేడు బ్లాక్‌ డేనా?’

‘తన వల్లే రాష్ట్ర విభజన అని.. నేడు బ్లాక్‌ డేనా?’

బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అవకాశవాద పొత్తు అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు

విజయవాడ: బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అవకాశవాద పొత్తు అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు పెద్దగా చేసింది, సాధించింది ఏమీ లేదని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోరే వారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణించడం సరికాదని మండిపడ్డారు. తన వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పిన చంద్రబాబు నాయుడు.. నేడు మాత్రం బ్లాక్‌ డే అనడం అవకాశవాదమే అవుతుంది తప్ప మరొకటి కాదని విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement