జగన్‌తో సుజయ్ భేటీ | Sujay Krishna Ranga Rao Meet with ys jagan | Sakshi
Sakshi News home page

జగన్‌తో సుజయ్ భేటీ

Feb 20 2016 11:39 PM | Updated on Apr 4 2018 9:25 PM

జగన్‌తో సుజయ్ భేటీ - Sakshi

జగన్‌తో సుజయ్ భేటీ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,

బొబ్బిలి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ కార్యాలయంలో కలిసిన వీరు విజయనగరం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జిల్లాలోని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలపై చర్చించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాకపోవడం,  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లున్న పంచాయతీలకు ఉపాధి పనులకు అధికారులకు అంచనాలు తయారు చేయకపోవడం వంటి అంశాలను చర్చించారు. వాటిపై పార్టీ పరంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల గురించి జగన్‌కు సుజయ్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement