అదనపు బస్సుల కోసం విద్యార్థుల ధర్నా | students strike at kooderu MRO office for rtc services | Sakshi
Sakshi News home page

అదనపు బస్సుల కోసం విద్యార్థుల ధర్నా

Oct 6 2015 11:03 AM | Updated on Nov 9 2018 4:51 PM

సకాలంలో మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అనంతపురం జిల్లా కూడేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

కూడేరు: సకాలంలో మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అనంతపురం జిల్లా కూడేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం, ఉరవకొండల మధ్య మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. సకాలంలో బస్సులు రాక, మోతాదుకు మించి బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. ఆలస్యంగా కాలేజీలకు వెళ్లడం వల్ల క్లాసులు నష్టపోతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement