కోనేరులో పడి విద్యార్థి మృతి | students falls on to death | Sakshi
Sakshi News home page

కోనేరులో పడి విద్యార్థి మృతి

Sep 1 2013 5:32 AM | Updated on Sep 1 2017 10:21 PM

కోనేరులో పడి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చిల్లాపురం (సంస్థాన్ నారాయణపురం) న్యూస్‌లైన్: కోనేరులో పడి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంది న మేకల రామకృష్ణ(16) సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిద ండ్రులు పద్మ, పెద్దులు వ్యవసాయం తో పాటు మేకలను పెంచుతున్నారు. ఉదయం పత్తిచేలకు మందు వేయడానికి తల్లిదండ్రులు తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. వారికి సాయం చేసేందుకు రామకృష్ణ, తన తమ్ముడితో కలసి మేకలను తోలుకొని అక్కడికి వెళ్లాడు.
 
 ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మందు చల్లిన జబ్బకు మట్టి అంటింది. దానిని కడిగేందుకు రామకృష్ణ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో కడిగేందు కు వెళ్లాడు. అది ప్లాస్టిక్ జబ్బ  కోనేరు లో పడింది. దాన్ని పట్టుకునేందుకు రామకృష్ణ నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక నీటి లో మునిగిపోయాడు. తమ్ముడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కోనేటిలో దూకి రామకృష్ణను బయటికి తీశారు. అప్పటికే అతడు మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement