బస్సుల కోసం విద్యార్థుల నిరసన | students dharna at highway in guntur | Sakshi
Sakshi News home page

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

Aug 31 2015 11:22 AM | Updated on Aug 24 2018 2:36 PM

బస్సుల కోసం విద్యార్థుల నిరసన - Sakshi

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

బస్సులు చాలటం లేదని, కొత్తగా సర్వీసులు నడపాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.

రొంపిచర్ల: బస్సులు చాలటం లేదని, కొత్తగా సర్వీసులు నడపాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని విప్పర్ల, రెడ్డిపాలెం, దారావారిపాలెం, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన 400 మంది విద్యార్థులు నిత్యం నరసరావుపేట పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు.

అయితే, ఆర్టీసీ బస్సులు వేళకు రాక, వచ్చినా సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సోమవారం ఉదయం విప్పర్ల వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి జాతీయరహదారిపై బైఠాయించారు. పది గంటల వరకు ఆందోళన కొనసాగటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థినీ విద్యార్థులను లాఠీచార్జితో చెదరగొట్టారు. రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement