డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థి చికిత్స పొందుతు మృతిచెందాడు.
డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థి చికిత్స పొందుతు మృతిచెందాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాలంపాడు గ్రామానికి చెందిన రాపూరి వెంకటాద్రి(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు చెన్నై ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తుండగా.. కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు.