రీకాకుళం జిల్లా హీర మండల కేంద్రంలో పింఛనుదారులు ఆందోళనకు దిగారు.
హీర : శ్రీకాకుళం జిల్లా హీర మండల కేంద్రంలో పింఛనుదారులు ఆందోళనకు దిగారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. హీర మండలానికి చెందిన లబ్దిదారులు మొన్నటి వరకు తమకు పింఛను అందిందని, అధికారులు ఇటీవలే తమ పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ హీరమండల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలగించిన పేర్లను పునరుద్ధరించాలన్న వారి డిమాండ్‌కు వైఎస్ఆర్ సీపీ మండల విభాగం మద్దతు తెలిపింది. ముట్టడి కార్యక్రమంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతోపాటు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.