రేపు సెయిల్ అధికారుల రాక | Steel Authority of India limited officers arrives tommrow | Sakshi
Sakshi News home page

రేపు సెయిల్ అధికారుల రాక

May 23 2014 1:40 AM | Updated on Nov 9 2018 5:37 PM

ఈనెల 24, 25తేదీలలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) అధికారుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈనెల 24, 25తేదీలలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) అధికారుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 9 మంది నిపుణులతో కూడిన సెయిల్ బృందం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు. ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగే సమావేశంలో మైన్స్, ఇరిగేషన్, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ సంబంధిత శాఖల అధికారులతో సెయిల్‌బృందం సమావేశమై చర్చిస్తుందన్నారు. 25వ తేదీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని ఆయన వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement