శ్రీవారి సుప్రభాత సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్ లోధా | Srivari suprabhata in the service of the Supreme Chief Justice Lodha | Sakshi
Sakshi News home page

శ్రీవారి సుప్రభాత సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్ లోధా

Sep 7 2014 11:36 PM | Updated on Sep 2 2017 1:01 PM

శ్రీవారి సుప్రభాత సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్ లోధా

శ్రీవారి సుప్రభాత సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్ లోధా

వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాత సేవలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోధా పాల్గొన్నారు.

తిరుమల: వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాత సేవలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోధా పాల్గొన్నారు. ఆదివారం వేకువజామున 2.30 గంటలకు జస్టిస్ లోధా తమ కుటుంబ సభ్యులతో కలసి తొలుత ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం.. బంగారు వాకిలి వద్దకు చేరుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో తిరుమల ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజులు జస్టిస్ లోధా కుటుంబ సభ్యులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement