చంద్రన్న బాట పథకంలో భాగంగా చేపడుతున్న రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. ఎం నాయక్
కలెక్టర్ ఎం. ఎం నాయక్
విజయనగరం మున్సిపాలిటీ : చంద్రన్న బాట పథకంలో భాగంగా చేపడుతున్న రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. ఎం నాయక్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించి రహదారుల పనులను మండలాల వారీగా సమీక్షించారు. రహదారుల నిర్మాణాలతో పాటు బిల్లుల చెల్లింపులపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బిల్లులు త్వరగా చెల్లించాలన్నారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని తెలి పారు. జిల్లా వ్యాప్తంగా 300 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉండగా ఇంతవరకు 141. 3 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పారు. రోజుకు సరాసరి 4.5 కిలోమీటర్ల రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.