తుంగభద్ర ప్రాజెక్టు నీటి పంపకంలో కర్ణాటకతో మన రాష్ట్రానికి ఉన్న వివాదాలపై చర్చించేందుకు ఈ నెల 24న ప్రత్యేక సమావేశం జరగనుంది.
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర ప్రాజెక్టు నీటి పంపకంలో కర్ణాటకతో మన రాష్ట్రానికి ఉన్న వివాదాలపై చర్చించేందుకు ఈ నెల 24న ప్రత్యేక సమావేశం జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారు. రాష్ర్ట మంత్రు లు సుదర్శన్‌రెడ్డి, రఘువీరారెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తుంగభద్ర కుడి హై లెవెల్ కెనాల్ ద్వారా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
దాంతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కుడి హై లెవెల్ కాల్వ ద్వారా ఇరు రాష్ట్రాలకు నీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే ఎగువలో కర్ణాటక ఆయకట్టు ఉండడంతో ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటిని వారికి కేటాయించిన దానికంటే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాంతో దిగువ మన ఆయకట్టుకు నీటికొరత ఏర్పడుతున్నది. ఈ సమస్యపై గతంలో పలు మార్లు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయి. అయినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో 24 న జరిగే సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.