మరో సోషల్‌మీడియా కార్యకర్త అరెస్టు | Social media activist Ippala ravindra arrested in Bangalore | Sakshi
Sakshi News home page

మరో సోషల్‌మీడియా కార్యకర్త అరెస్టు

May 16 2017 9:14 PM | Updated on Oct 22 2018 6:02 PM

మరో సోషల్‌మీడియా కార్యకర్త అరెస్టు - Sakshi

మరో సోషల్‌మీడియా కార్యకర్త అరెస్టు

సోషల్‌మీడియా కార్యకర్త ఇప్పాల రవీంద్రను బెంగుళూరులో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు.

బెంగుళూరు: సోషల్‌మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇప్పాల రవీంద్రను బెంగుళూరులో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత నోటీసులు అందుకోవడానికి రామ్మూర్తి నగర్‌ స్టేషన్‌కు రావాలని చెప్పిన పోలీసులు.. అక్కడికి వెళ్లిన రవీంద్రను ఎలాంటి విచారణ జరపకుండా అదుపులోకి తీసుకున్నారు. చట్టబద్దంగా సమాధానం ఇస్తామని.. సమయం ఇవ్వాలని రవీంద్ర చెప్తున్నా పోలీసులు వినలేదు.

కాగా, రవీంద్ర అరెస్టును వైఎస్‌ఆర్‌సీపీ ఖండించింది. సోషల్‌మీడియాను అణగదొక్కడానికి ఏపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంభిస్తోందని పేర్కొంది. నోటీసుల పేరుతో స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేయడం కుట్రపూరిత చర్య అని వ్యాఖ్యానించింది. పోలీసు అధికారి మోహనరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రవీంద్ర అరెస్టుపై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement