ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌ పేలింది! | Smartphone blasted and that was issued by government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌ పేలింది!

Aug 14 2018 4:15 AM | Updated on Aug 14 2018 4:15 AM

Smartphone blasted and that was issued by government - Sakshi

పూర్తిగా కాలిపోయిన బ్యాటరీ, సెల్‌ఫోన్‌

లవీరఘట్టం: అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్‌ పేలిపోయింది. దీంతో భయభ్రాంతులకు గురైన అంగన్‌వాడీ కార్యకర్తలు ఉరుకులు పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఐసీడీఎస్‌ కార్యాలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఐసీడీఎస్‌ కార్యాలయంలో సమావేశం ఉండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సూపర్‌వైజర్‌ రాకపోవడంతో చేబియ్యంవలస అంగన్‌వాడీ కార్యకర్త ఎం.వెంకటమ్మ ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్‌లో అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్‌ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో వెంటనే విసిరేశారు. తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్‌ పేలిపోయిందని ఆమె తెలిపారు. దూరంగా విసిరేయడంతో ప్రమాదం తప్పిందని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement