జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనవర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ధర్నాకు దిగారు.
అనంతపురం : జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనవర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. భోజనంలో పురుగులు రావడంతో రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మెస్ బిల్లులు సకాలంలో చెల్లించినా సరిగ్గా భోజనం పెట్టడం లేదని, రోజువారీ మెనూ బాగాలేదని, తాగునీటి సమస్య కూడా ఉందని సమస్యలు ఏకరువు పెట్టారు. రిజస్ట్రార్ చెంచురామయ్య వచ్చి సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.