అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | Should speed up the development works | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

May 15 2016 4:30 AM | Updated on Sep 4 2017 12:06 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

సదుం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి.....

సదుం: సదుం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, సర్పంచ్ సయ్యద్‌బాషాకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సూచిం చారు. ఎర్రాతివారిపల్లెలోని స్వగృహంలో ఉన్న ఆయన్ను శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. సదుంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్టాండు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. షాదీమహల్ పునర్నిర్మాణ పనుల పై అధికారులతో ఫోన్‌లో చర్చించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.

ఆ నిధులతో పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నూతన తాగునీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆరా తీశారు. అభివృద్ధిలో సదుం పంచాయతీని ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఖాజాపీర్, రమేష్, ఖమ్రుద్దీన్, విద్యార్థి విభాగం నాయకులు బావాజీ, మదన్, వంశీ, పీలేరు కో-ఆప్షన్ మెంబరు హబీబ్, పులిచర్ల వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ మురళీరెడ్డి, ధనశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement