శివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు | shivaratri festival Proper arrangements | Sakshi
Sakshi News home page

శివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు

Feb 25 2014 3:26 AM | Updated on Sep 2 2017 4:03 AM

శ్రీముఖలింగంలో శివ రాత్రి జాతర సజావుగా జరిగేలా పక్కా ఏర్పా ట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు.

జలుమూరు,న్యూస్‌లైన్ : శ్రీముఖలింగంలో శివ రాత్రి జాతర సజావుగా జరిగేలా పక్కా ఏర్పా ట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు. దీని కోసం దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని వివరించారు. జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఆలయ అధికారులు, అర్చకులతో చర్చించారు. వృద్ధు లు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలై న్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎండతాకిడి లేకుండా షామియానాలు, తాటా కు పందిళ్లు వేయాలన్నారు. చక్రతీర్థ ఉత్సవం రోజున అదనపు బలగాలను నియమించాలని పోలీస్ శాఖకు లేఖ రాస్తామని వెల్లడిం చారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నీటి ప్యాకెట్ల వల్ల కాలు ష్య సమస్య వస్తుందన్నారు. దేవాదాయ భూములకు కౌలు కట్టనివారికి నోటీసులు జారీచేస్తామన్నారు. తొలుత ఆయన ముఖలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట ఏసీ  వి.శ్యామలాదేవి, పరిశీలకులు ప్రసాద్, పాలకొండ ఈవో జగన్నాథ్, స్థానిక ఆలయ మేనేజర్ సీహెచ్.ప్రభాకరరావు ఉన్నారు.
 
 ముమ్మరంగా పనులు
 శివరాత్రి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ మేనేజర్ ప్రభాకరరావు చెప్పారు. సోమవారం నుంచి క్యూలైన్లు,తాటాకు పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనా మేరకు అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
 
 ఆక్రమణలపై కఠిన చర్యలు
 పాలకొండ రూరల్: దేవాదాయ శాఖ భూముల ఆక్ర మణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి చెప్పారు. సోమవారం కోటదుర్గమ్మ ఆలయా న్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 1,392 దేవస్థానాలకు 53 వేల ఎకరాల భూమి ఉండగా ఇం దులో 6,300 ఎకరాల మెట్టు, 4,400 ఎకరాల పల్లపు భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటిపై కేసులు నడుస్తున్నాయని వివరించారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. దేవాదాయ శాఖ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ శాఖను కోరామని తెలిపారు. రైతులకు 33,950 ఎకరాలు లీజుకు ఇచ్చామని వెల్లడించారు. ఆయన వెంట ఆలయ ఈవో కె.వి.రమణమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ శాసపు సర్వారావు, ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement