సీమాంధ్రలో ఈ నెల 21 నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది.
ఈ నెల 21 నుంచి 27 వరకు కాంగ్రెస్ ప్రచారం..
సీమాంధ్రలో ఈ నెల 21 నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 27న కర్నూలులో ముగియనుంది. రాష్ట్ర విభజన కు కారణాలు, కాంగ్రెస్ పాత్ర ఎంత తదితర అంశాలను కార్యకర్తలకు వివరించి వచ్చే ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు సి.రామచంద్రయ్య తదితరులు సోమవారం మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నివాసంలో భేటీ అయ్యారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, ఆపై సాధారణ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడంపై చర్చించారు.