వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ చేపట్టారు.
వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ
Aug 23 2013 5:17 PM | Updated on May 29 2018 4:06 PM
గుంటూరు: వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు విజయమ్మకు మద్దతు ప్రకటిస్తుంటడంతో రోడ్లన్నీ జన సందోహమైయ్యాయి. ఆమె చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటూ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి వైఎస్సార్‌సీపీ ర్యాలీ ఆరంభించారు.
శంకర్ విలాస్, ఓవర్ బ్రిడ్జ్, ఏసీ కాలేజీ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్‌లు మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంది. రోడ్లన్నీ సమైక్య నినాదం మార్మోగింది.
Advertisement
Advertisement