సీమాంధ్ర ప్రజలను వెళ్లగొట్టం: హరీష్రావు | seemandhra people stay in telangana after state division: Harish Rao | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ప్రజలను వెళ్లగొట్టం: హరీష్రావు

Sep 3 2013 4:55 PM | Updated on Jul 28 2018 4:52 PM

సీమాంధ్ర ప్రజలను వెళ్లగొట్టం: హరీష్రావు - Sakshi

సీమాంధ్ర ప్రజలను వెళ్లగొట్టం: హరీష్రావు

మూడోసారి అధికారం దక్కదనే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.

మూడోసారి అధికారం దక్కదనే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. సీమాంధ్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూ, మరోవైపు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

సీమాంధ్ర ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ప్రజలను ఎవరూ వెళ్లగొట్టరని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని హరీష్రావు అన్నారు.

తెలంగాణ విభజన తర్వాత తలెత్తే సమస్యలేమిటో నిర్దిష్టంగా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని నిన్న హరీష్‌రావు సూచించారు. తెలంగాణపై వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు, నీచ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే అని విమర్శించారు. ఎక్కువసార్లు మాటమార్చిన చరిత్ర కూడా ఆయనదేనని దుయ్యబట్టారు. అపోహలు, అనుమానాలతో ఆందోళనలు చేస్తుంటే ఇరు ప్రాంతాల వారినీ కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని హరీష్‌రావు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement