'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే' | Seemandhra Congress Leaders lobbying for CM Post, says paladugu venkata rao | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'

Feb 21 2014 3:14 PM | Updated on Sep 2 2017 3:57 AM

'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'

'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'

సీఎం పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు అన్నారు.

హైదరాబాద్‌: సీఎం పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు అన్నారు. కిరణ్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్ నుంచి సీమాంధ్ర రాష్ట్రాన్ని నడపలనుకోవడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. 15, 25 రోజుల్లో సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అనేది కేంద్రమే తేల్చాలన్నారు. రాజధాని అంశంపై సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement