ప్రభుత్వ లాంఛనాలతో పాలడుగు అంత్యక్రియలు | paladugu venkata rao Funerals completed in Nuziveedu | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో పాలడుగు అంత్యక్రియలు

Jan 21 2015 12:14 PM | Updated on Sep 2 2017 8:02 PM

ప్రభుత్వ లాంఛనాలతో పాలడుగు అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో పాలడుగు అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

కృష్ణా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. నూజివీడులోని కృష్ణారెడ్డి కాలనీకి సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. అంతకముందు ఆయన భౌతికకాయాన్ని పోలీసు కవాతు నడుమ ఊరేగింపుగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, పులువురు నేతలు పాల్గొన్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement