సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ | secretariat Seemandhra employees rally to attend Save Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ

Sep 7 2013 11:55 AM | Updated on Mar 23 2019 9:03 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మేము సైతం అంటూ ర్యాలీగా కదిలారు.

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మేము సైతం అంటూ ర్యాలీగా కదిలారు. సచివాలయం నుంచి బయల్దేరిన ఈ ర్యాలీలో సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు. ర్యాలీకి మహిళా ఉద్యోగులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.

మరోవైపు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఏపీ ఎన్జీవోల ఉద్యోగులు భారీగా తరలి వస్తున్నారు. వారందరినీ పోలీసులు తనిఖీలు చేసి గేట్ వన్ నుంచి లోనికి పంపిస్తున్నారు.  స్టేడియంలోని స్టాండ్స్ నిండిపోవటంతో మైదానంలోనే ఉద్యోగులు కూర్చుంటున్నారు. సీమాంద్ర ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కిటకిటలాడుతోంది. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement