కనీస వసతులు కూడా లేని చోట తామెలా పనిచేయగలమని ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు వాపోయారు.
అమరావతి: కనీస వసతులు కూడా లేని చోట తామెలా పనిచేయగలమని ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు వాపోయారు. మహిళా ఉద్యోగులు బుధవారం రెండు బస్సుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లి నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. వెలగపూడిలో సెక్రటేరియట్ నిర్మాణ పనులు జరుగుతున్న చోటును పరిశీలించారు. అక్కడ మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేకపోవటంపై వారు తీవ్ర నిరాశ వెలిబుచ్చారు. అసౌకర్యాలకు నిలయంగా ఉన్న తాత్కాలిక సచివాలయంలో తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు.