అడ్డగోలు దోపిడీ

Sarvajana Hospital Scanning Centres Bills Collecting - Sakshi

సీటీ స్కాన్‌ నిర్వాహకుడి అతి తెలివి

రెండేళ్లుగా ఆస్పత్రి నుంచే కరెంటు వినియోగం

రిపోర్టులకు మాత్రం బిల్లు వసూలు

చోద్యం చూస్తున్న ఆస్పత్రి యాజమాన్యం

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని సీటీ స్కాన్‌ నిర్వాహకులు అడ్డగో లు దోపిడీకి తెరలేపారు. 2017లో స్కానింగ్‌ యంత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్‌ వినియోగాన్ని తెలిపే మీ టర్‌ను ఏర్పాటు చేయించుకోలేదు.  ఇ ప్పటి వరకు ఆస్పత్రి యాజమాన్యంపై రూ 25 లక్షల నుంచి రూ 30 లక్షల భారం పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రూ లక్షల్లో సీటీ స్కాన్‌ నిర్వాహకులు లబ్ధిపొం దారని చెప్పాలి. అయినా ఆస్పత్రి  ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎంఓయూ బుట్టదాఖలు
ఎస్‌ఎల్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఒప్పంద నియమాలను (ఎంఓయూ) బుట్ట దా ఖలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఎంఓయూలో సీటీ స్కాన్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా కరెంటు మీటర్‌ వేసుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా కరెంటు బిల్లు వారే చెల్లిం చాలి. కానీ ఇంతవరకు మీటర్‌ బిగించలేదు.  సర్వజనాస్పత్రిలో రోగులకు సంబంధించి రోజూ 25 నుంచి 30 సీటీ స్కాన్‌లు చేస్తారు. ప్రభుత్వం ఒక్కో స్కాన్‌కి రూ 899 చెల్లిస్తుంది. ఇలా ప్రతి నెలా సీటీ స్కాన్‌ నిర్వాహకులు 900 నుంచి వెయ్యి స్కానింగ్‌ తీస్తారు. ఇలా స్కాన్‌ నిర్వాహకులకు ప్రతి నెలా రూ 8 లక్షల నుంచి రూ 9 లక్షల వరకు బిజినెస్‌ జరుగుతుంది.

రూ 30 లక్షల భారం
సాధారణంగా ఏదేనీ సీటీ స్కాన్‌ నిర్వహణలో ప్రతి నెలా రూ లక్షకుపైగానే కరెం టు బిల్లు వస్తుంది. ఆస్పత్రిలో వినియోగించే స్కాన్‌కు రూ లక్షల్లోనే కరెంటు బిల్లు వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా రూ లక్షల్లో లబ్ధిపొందుతున్నా..ఎందుకు కరెంటు మీటర్‌ వేయించుకోలేదో అర్థం కావడం లేదు. ఆస్పత్రిలోని ఓ కీలక అధికారి అండదండలతోనే ఈ అడ్డగోలు వ్యవహారం సాగుతోందని సమాచారం.

ప్రతి పైసా చెల్లించాల్సిందే  
విద్యుత్‌ వినియోగానికి సంబంధించి సీటీ స్కాన్‌ నిర్వాహకులు ప్రతిపైసా చెల్లించాల్సి ందే. స్కానింగ్‌ యూనిట్‌లో ప్రత్యేకంగా మీటర్‌ బిగించుకోని విషయం నిజమే.  అందుకు సంబంధించి మీటర్‌ బిగించుకోవాలని చెప్పాం. త్వరలో వేయిస్తామన్నారు. మీటర్‌ అమర్చాక వచ్చే మొదటి మూడు నెలల  సగటు  తీసుకొని బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top