సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు

Sakshi Photographer Mohan Krishna Gets National Award

తిరుపతి కల్చరల్‌ : తిరుపతికి చెందిన సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కేతారి మోహన్‌ క్రిష్ణకు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటో గ్రాఫర్స్‌ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్‌ ఫొటో గ్రాఫర్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫొటో కాంటెస్ట్‌ నిర్వహించారు. ఫొటో ట్రావెలర్‌ విభాగంలో  రాత్రి వేళ  తిరుమల శ్రీవారి ఆలయ సౌందర్యం ఫొటోకు, ఫొటో జర్నలిజం విభాగంలో తిరుమలకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నడుçస్తూ వస్తున్న సమయంలో ఆయనను చూసిన  ఓ అభిమాని వెళుతున్న బస్సు కిటికీలోనుంచి దూకుతుండగా తీసిన మరో ఛాయా చిత్రానికి బహుమతులు లభించాయి. అమరావతిలో ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న  ప్రపంచ ఫొటో గ్రాఫర్స్‌ దినోత్సవాల్లో కేతారి మోహన్‌ క్రిష్ణ  ఈ అవార్డులను అందుకోనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top