కడపలో డిపోలకే పరిమితమైన బస్సులు | RTC Strike from Today; Over 956 Buses to Go Off Roads in kadapa | Sakshi
Sakshi News home page

కడపలో డిపోలకే పరిమితమైన బస్సులు

May 6 2015 6:51 AM | Updated on Sep 3 2017 1:33 AM

ఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులన్నీ బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి.

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులన్నీ బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 8 డిపోలలోని 956 బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. వైఎస్సార్ జిల్లాకు చెందిన 4558 మంది కండక్టర్లు, క్లీనర్‌లు విధులకు హాజరుకాకుండా సమ్మెలో పాల్గొన్నారు.

బస్సులు డిపో దాటి బయటకు రాకపోవడంతో దూరప్రాంత ప్రయాణికులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు బస్సు యజమానులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement