Go Off Roads
-
డిపోలకే పరిమితమైన బస్సులు
-
నల్గొండలో డిపోలకే పరిమితమైన 750 బస్సులు
నల్గొండ: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలోని 7 డిపోలకు చెందిన 750 బస్సులు రోడ్డెక్కకుండా డిపోలకే పరిమితమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలోని బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. -
కడపలో డిపోలకే పరిమితమైన బస్సులు
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులన్నీ బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 8 డిపోలలోని 956 బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. వైఎస్సార్ జిల్లాకు చెందిన 4558 మంది కండక్టర్లు, క్లీనర్లు విధులకు హాజరుకాకుండా సమ్మెలో పాల్గొన్నారు. బస్సులు డిపో దాటి బయటకు రాకపోవడంతో దూరప్రాంత ప్రయాణికులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు బస్సు యజమానులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.