నల్గొండలో డిపోలకే పరిమితమైన 750 బస్సులు | RTC Strike from Today; Over 750 Buses to Go Off Roads in nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో డిపోలకే పరిమితమైన 750 బస్సులు

May 6 2015 7:32 AM | Updated on Sep 3 2017 1:33 AM

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.

నల్గొండ: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలోని 7 డిపోలకు చెందిన 750 బస్సులు రోడ్డెక్కకుండా డిపోలకే పరిమితమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలోని బస్టాండ్‌లు నిర్మానుష్యంగా మారాయి.

బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకునే పనిలో పడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement