విరిగిన బస్సు యాక్సిల్ రాడ్; తప్పిన ప్రమాదం | RTC bus Axle rod breaks down at Prakasam | Sakshi
Sakshi News home page

విరిగిన బస్సు యాక్సిల్ రాడ్; తప్పిన ప్రమాదం

Feb 2 2015 11:15 AM | Updated on Sep 2 2017 8:41 PM

విరిగిన బస్సు యాక్సిల్ రాడ్; తప్పిన ప్రమాదం

విరిగిన బస్సు యాక్సిల్ రాడ్; తప్పిన ప్రమాదం

యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్ యాక్సిల్ రాడ్ ఊడిపోయిన సంఘటన స్థానిక కేజీబీవీ పాఠశాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

పుల్లలచెరువు : యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్ యాక్సిల్ రాడ్ ఊడిపోయిన సంఘటన స్థానిక కేజీబీవీ పాఠశాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. చెరువు గట్టుపై ఇలా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు అన్నారు.
 
  ప్రభుత్వం కాలం చెల్లిన బస్సులు నడుపుతూ.. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు భత్రతా వారోత్సవాలను నిర్వహించిన  కొద్దిరోజులకే ఈ సంఘటన చోటుచేసుకోవడాన్ని గమనిస్తే.. ప్రభుత్వం ప్రయాణికులకు ఎలాంటి భద్రత కల్పిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement