రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs. 5 crore worth red sandalwood seized at chittoor district | Sakshi
Sakshi News home page

రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Mar 9 2014 2:34 PM | Updated on Sep 2 2017 4:31 AM

చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజీ కుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని భారీ ఎత్తున అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజీ కుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని భారీ ఎత్తున అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులుకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.

 

స్వాధీనం చేసుకున్నఎర్రచందనం విలువు రూ. 5 కోట్లు వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్ర చందనం తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement