రాజధానిలో కిలోమీటర్ రహదారి నిర్మాణానికి రూ.17.23 కోట్లు వ్యయం అవుతున్న విషయం వాస్తవమేనని
ఏడీసీ తరఫున జరిగే నిర్మాణాలకు ఆచితూచి అంచనాలను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్‌ను ఈపీసీ విధానంలో చేపట్టగా.. ఒక కిలోమీటర్‌కు రూ.25 కోట్లు వెచ్చించారని, కానీ రాజధానిలో నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ఏడీసీ కిలోమీటర్‌కు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లతో మాత్రమే అంచనాలను రూపొందించిందని పేర్కొంది.