శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి చోరీ యత్నం జరిగింది.
ఏటీఎం చోరీకి విఫలయత్నం
Jan 28 2016 11:43 AM | Updated on Aug 30 2018 5:27 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి చోరీ యత్నం జరిగింది. సెంటర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి మిషన్‌ను తెరిచేందుకు యత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవటంతో దుండగులు పరారయ్యారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎంలోని సీసీఫుటేజిని పరిశీలిస్తున్నారు.
Advertisement
Advertisement