భీమవరంవైపు వెళుతున్న బస్సుపై దాడి | Robbers Stoned On Travel Bus In Eluru | Sakshi
Sakshi News home page

బస్సుపై రాళ్లు రువ్విన దుండగులు

Mar 30 2018 1:32 PM | Updated on Mar 30 2018 1:32 PM

Robbers Stoned On Travel Bus In Eluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వెళుతున్న బస్సును ఆపి రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటన కలకం రేపింది. ఈ సంఘటన  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో చోటుచేసుకుంది. బీఎస్ఆర్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు భీమవరంవైపు వెళ్తుండగా కైకలూరు బైపాస్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు.

ఊహించని ఈ దాడితో భయభ్రాంతులైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం డ్రైవర్‌ బస్సును దగ్గరలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించాడు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement