విద్యార్థుల విహార యాత్ర.. ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Jan 4 2020 6:53 AM | Updated on Jan 4 2020 8:21 AM

Road Accident In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు విహార యాత్రకు వెళ్తుండగా ఉడిపి సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి బాబా ఫకృద్దీన్‌ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అద్దాలు పగులుగొట్టి కొందరు విద్యార్థులను ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారు ఉడిపి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement