గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై సమీక్ష | review on godavari, krishna rivers linking | Sakshi
Sakshi News home page

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై సమీక్ష

Nov 19 2014 7:36 PM | Updated on Jul 28 2018 3:23 PM

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై సమీక్ష - Sakshi

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై సమీక్ష

నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. గోదావరి వరద జలాల వినియోగానికి రూ.1272 కోట్లు నిధులు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాయలసీమకు మరింత లబ్ది కలుగుతుందని చెప్పారు. పెండింగ్ లో వంశధార, తోటపల్లి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రధాన కాల్వ పనులు వచ్చే రబీ నాటికి పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement