రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీంగా ఎన్నికైంది. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్‌లో
కాకినాడ సిటీ : రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీంగా ఎన్నికైంది. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్‌లో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్.దివాకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘ డివిజన్ అధ్యక్షులుగా పి.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షులుగా జె.సింహాద్రి, ఉపాధ్యక్షులుగా ఎన్‌ఎస్‌ఎస్.ప్రసాద్, పివి.సీతాపతిరావు, కె.రత్నకుమారి, కార్యదర్శిగా ఎ.తాతారావు, ట్రెజరర్‌గా జేవీఆర్.రమేష్, జాయింట్ సెక్రటరీలుగా పి.మాచారావు, కె.మరిడయ్య, వి.గోపి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎస్.సత్యనారాయణ, కె.ఈశ్వరరావు, కౌన్సిల్ మెంబర్లుగా కె.శ్రీనివాస్, ఆర్‌టిటివిజె.సీతారామ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాద్ అభినందించారు. అనంతరం నూతనకార్యవర్గం మర్యాదపూర్వకంగా కాకినాడ ఆర్డీవో అంబేద్కర్‌ను కలిసింది.