చండీగఢ్‌లో విశాఖ జిల్లా వాసి మృతి | Resident of Vizag dies in Chandigarh | Sakshi
Sakshi News home page

చండీగఢ్‌లో విశాఖ జిల్లా వాసి మృతి

Jul 20 2015 3:11 PM | Updated on Sep 3 2017 5:51 AM

విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్ రాష్ట్రంలోని ఓ జలపాతంలో పడి మృతి చెందాడు.

చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన యువకుడు చండీగఢ్ రాష్ట్రంలోని ఓ జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. పీఎస్ పేట గ్రామానికి చెందిన కూనిశెట్టి కుమార్(21) చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు.

కాగా ఆదివారం ఓ జలపాతం చూసేందుకు వెళ్లి  ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని వాయుసేన విభాగం అధికారులు ఆదివారం రాత్రి కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించనున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement