‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక | 'Report on NTR Sujala Sravanthi in 3 weeks' | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక

Jun 18 2014 1:15 AM | Updated on Sep 2 2017 8:57 AM

‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక

‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక

జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రికి

 ఏలూరు : జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రికి మంగళవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జెడ్పీ అధికారులతో కొద్దిసేపు మంత్రి సమీక్షిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకంలో భాగంగా ప్రతి గ్రా మంలో రూ.2 కే 20 లీటర్ల సురక్షిత తా గునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అదికారులకు ఆదేశించారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు.
 
  ద్వారా ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తాడేపల్లిగూడెం శరవేగంగా అభివృద్ధి చెందుతోం దని, అయితే పట్టణ ప్రజలు వేసవిలో తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలి పారు. ఏలూరు కాలువ ద్వారా తాడేపల్లిగూడెం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నింపుతున్నా వేసవిలో నీటి ఎద్దడి తప్పడం లేదన్నారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా పైప్‌లైను ద్వారా తాడేపల్లిగూడెంనికి నీరందించే విషయంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మిపతిరాజు, జయచంద్రబాబు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement