రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాంకేతికతను జోడించి ఆధునిక బోధనా పద్ధతులతో కూడిన నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన డెల్ కంపెనీ ప్రతి నిధులతో పాఠశాల విద్యపై చర్చించారు. పాఠశాలల్లో ప్రమాణాలను పెంచేందుకు రూపొందించిన విధానాలపై డెల్ ప్రతినిధు లు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే తాము బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
వసతులు, నిధులకు లోటు లేదు
పాఠశాలల్లో వసతులు, నిధులకు లోటు లేదని, కావాల్సిందల్లా వ్యవస్థను సమర్థంగా నడిపించే చోదక శక్తి మాత్రమేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి టీచర్, ప్రతి విద్యార్థి గురించి తెలుసుకునేలా సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టాలని డెల్ ప్రతినిధులను ఆయన కోరారు.