అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.
గుంటూరు: అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయిపాలెం గ్రామంలో జరిగింది. వివరాలు.. అక్రమంగా 25.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవైర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రేపల్లె)