తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. ప్రశ్నోత్తరాల సమయం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో మేయర్ శేషసాయి సభ నుంచి వెళ్లిపోయారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.