ఇంద్రకీలాద్రిపై ఘనంగా రాజగోపురం ప్రారంభం | Rajagopuram inaugurates at Bejawada Indrakiladri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై ఘనంగా రాజగోపురం ప్రారంభం

Apr 11 2015 12:07 AM | Updated on Sep 3 2017 12:07 AM

ఇంద్రకీలాద్రిపై ఘనంగా రాజగోపురం ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై ఘనంగా రాజగోపురం ప్రారంభం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన రాజగోపురం, మల్లికార్జున మహామండపాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన రాజగోపురం, మల్లికార్జున మహామండపాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందుకు శృంగేరీ శివగంగ శారదా పీఠాధిపతి శ్రీ పురుషోత్తమ భారతీ స్వామీజీ ఆధ్వర్యంలో రాజగోపురంపై నవ స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

అనంతరం భారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. మంత్రులు మాట్లాడుతూ... ఇంద్రకీలాద్రి దిగువ నుంచి రాజగోపురానికి చేరుకోవడానికి కావాల్సిన ర్యాంపుల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అన్నదాన భవనంపై నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్‌లతోపాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement