రియో ఒలింపిక్స్‌కు రాహుల్ ఎంపిక | Rahul selection of Rio Olympics | Sakshi
Sakshi News home page

రియో ఒలింపిక్స్‌కు రాహుల్ ఎంపిక

Feb 16 2015 2:38 AM | Updated on Sep 2 2017 9:23 PM

వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం ప్రకటించింది.

బాపట్ల : వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 85 కిలోల విభాగంలో స్వర్ణపతకాల వేటలో ఉన్న రాహుల్‌ను ఒలింపిక్స్ ఎంపిక చేయటంతోపాటు,  ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పంజాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
 
  రాహుల్ ఎంపిక కావటంతో ఆయన స్వగ్రామైన బాపట్ల మండలం స్టువర్టుపురంలో సందడి వాతావరణం నెలకొంది. రాహుల్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ముప్పలనేని శేషగిరిరావు, ప్రిన్సిపాల్ శారానివేదిత అభినందనలు తెలిపారు. రాహుల్ తల్లిదండ్రులు మధు, నీలిమా తన బిడ్డ ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణపతకాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement