రేచల్ చటర్జీకి రెండు బంగారు పతకాలు | Rachel Chatterjee Bags 2 Gold Medals | Sakshi
Sakshi News home page

రేచల్ చటర్జీకి రెండు బంగారు పతకాలు

Feb 24 2014 2:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ మరోసారి పరుగు పందెంలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ మరోసారి పరుగు పందెంలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2014 పోటీలలో రేచల్ ఛటర్జీ రాష్ట్రం తరపున పాల్గొన్నారు. 5 వేల మీటర్ల దూరాన్ని 25 నిమిషాల 26 సెకన్లలో అధిగమించారు. అలాగే, మరో పోటీలో 10 వేల మీటర్ల దూరాన్ని 59 నిమిషాల్లో అధిగమించి రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు. గతేడాది బెంగళూరులో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఈ రెండు విభాగాల్లో బంగారు పతకాలు రేచలే గెలుచుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement