అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు

Pushpa Srivani Comments On Grama Sachivalayam Appointments - Sakshi

సాక్షి, విజయనగరం: అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయ నియామకాలు చేపట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుష్ప శ్రీవాణి నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎంపికైన ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారని తెలిపారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నవారిపైన ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాక్కులు చవాక్కులు విసిరారని విమర్శించారు. పేపర్‌ లీక్‌ అంటూ అసత్య ప్రచారాలు చేపట్టారని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top