భీమవరం ఎమ్మెల్యేకు అస్వస్థత | pulaparthi ramanjaneyulu hospitalised | Sakshi
Sakshi News home page

భీమవరం ఎమ్మెల్యేకు అస్వస్థత

Jun 20 2014 10:22 AM | Updated on Sep 2 2017 9:07 AM

భీమవరం ఎమ్మెల్యేకు అస్వస్థత

భీమవరం ఎమ్మెల్యేకు అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై రామాంజనేయులు గెలిచారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత, ఆంజనేయులు కుమారుడు వెంకట్‌రామ్ ప్రశాంత్‌ల వివాహం గత డిసెంబర్ లో జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement